విడుదల తేదీ : 4 ఏప్రిల్ 2014 TeluguArea.com : 3.5/5 దర్శకుడు : రామ్ గోపాల్ వర్మ నిర్మాత : విజయ్ కుమార్. ఆర్, గజేంద్ర నాయుడు.పి సంగీతం : సాయి కార్తీక్ నటీనటులు : డా. మోహన్ బాబు, మంచు విష్ణు, జయసుధ, శాన్వి..
కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు రియలిస్టిక్ లుక్ లో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో చేసిన ఫ్యాక్షన్ సినిమా ‘రౌడీ’. మంచు విష్ణు మరో హీరోగా నటించిన ఈ సినిమాకి విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించాడు. జయసుధ, శాన్వి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి సాయి కార్తీక్ సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్, టీజర్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచితే, ఎన్నడూ ఊహించని వర్మ – మోహన్ బాబు కాంబినేషన్ కూడా ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. మరి ఆ అంచనాలను అందుకునే ర్న్జ్ లో ఈ ‘రౌడీ’ ఉన్నాడా? లేదా? అనేది ఇప్పుడు చూద్దాం..
కథ :
రాయలసీమ ప్రాంతంలోని ప్రజలకు ఏమి అవసరం ఉన్నా ఆదుకునే వ్యక్తి అన్నగారు(డా. మోహన్ బాబు). దీనివల్ల ఆయనకి కొంతమంది శత్రువులు ఉంటారు. అన్నగారికి ఇద్దరు కొడుకులు ఒకరు భూషణ్(కిషోర్), రెండు కృష్ణ(మంచు విష్ణు). భూషణ్ చేసే పనుల వల్ల అన్నగారికి అతనిపై కోపం ఉంటుంది. కృష్ణ తన చదువు పూర్తి చేసుకొని ఇంట్లో ఉంటాడు, అలాగే శిరీష(శాన్వి) ప్రేమలో ఉంటాడు.
రాయలసీమ ప్రాంతంలో నందవరం ప్రాజెక్ట్ తేవాలని కె.ఆర్ ట్రై చేస్తుంటాడు. కానీ ఆ ప్రాజెక్ట్ వల్ల 24 గ్రామాల ప్రజలకు అన్యాయం జరుగుతుందని అన్నగారు ఆపుతుంటారు. దాంతో ఆర్.కె మనుషులైన శేషగిరి, వేదం, చండి కలిసి అన్నగారిని చంపాలని ప్లాన్ చేస్తారు. ఆ ప్లాన్ గురించి తెలుసుకున్న కృష్ణ తన తండ్రి అయిన అన్నగారిని ఎలా కాపాడుకున్నాడు? ఆ కాపాడే ప్రయత్నంలో ఎవరెవరిని కోల్పోయాడు? అలాగే ఆర్.కె ఎవరు అనే విషయాలు తెలియాలంటే మీరు రెస్పెక్ట్ తో ‘రౌడీ’ సినిమా చూడాల్సిందే..
ప్లస్ పాయింట్స్ :
‘రౌడీ’ సినిమాకి ప్రాణం పోసింది కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు పెర్ఫార్మన్స్ అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఆయన స్క్రీన్ పై కనిపించినంత సేపు సినిమా చాలా ఎమోషనల్ గా ఉంటుంది. సినిమా పరంగా ఆయన రియలిస్టిక్ లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. చాలా రోజుల తర్వాత పాత పంచ్ డైలాగ్స్ మోహన్ బాబు యాక్షన్ ఈ సినిమాలో చూస్తారు. ఇక మంచు విష్ణు ఈ సినిమాకి మరో పెద్ద ప్లస్ పాయింట్. విష్ణు ఇలాంటి పాత్రని ఇప్పటి వరకూ చేయలేదు, కానీ చాలా మంచి నటనని కనబరిచాడు. ఫుల్ లెంగ్త్ సీరియస్ రోల్లో మంచి నటనని కనబరిచాడు. అందరూ అన్నట్టే ఈ సినిమాలో విష్ణు కొత్తగా కనిపించి మిమ్మల్ని మెప్పిస్తాడు.
సహజ నటి జయసుధ గారు ఎప్పటిలానే మంచి నటనని కనబరిచారు. శాన్వి చేయడానికి పెద్దగా ఏమీలేకపోయినా ఉన్నంతలో తన పాత్రకి న్యాయం చేసింది. అలాగే ‘నీ మీద ఓట్టు’ పాటలో బాగా గ్లామరస్ గా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. వేదం పాత్రలో తనికెళ్ళ భరణి వేదాలు బాగా చెప్పాడు. అలాగే పరుచూరి గోపాలకృష్ణ కూడా ఉన్నంతలో మెప్పించాడు.
ఫస్ట్ హాఫ్ చివర్లో వచ్చే 11 నిమిషాల ఫైట్ దగ్గర సినిమా కాస్త ఊపందుకుంటుంది. సెకండాఫ్ కాస్త ఫాస్ట్ గా అనిపించడంతో బోర్ కొట్టదు. అలాగే ఈ సినిమా 2 గంటలే ఉండడం సినిమాకి చాలా పెద్ద ప్లస్ అని చెప్పాలి.
మైనస్ పాయింట్స్ :
ఈ చిత్ర టీం ముందుగా చెప్పినట్టు రెగ్యులర్ కమర్షియల్ అంశాలైన కామెడీ, 5, 6 పాటలు ఉండవు. అవి ఆశించి వెళ్ళే వారికి నిరాశే మిగులుతుంది. అలాగే మాస్ మసాలా ఎంటర్టైనర్స్ కోరుకునే బి, సి సెంటర్ ప్రేక్షకులను సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు. నటీనటుల పెర్ఫార్మన్స్ మీద శ్రద్ధ పెట్టిన వర్మ సినిమాలోని కొన్ని లాజికల్ పాయింట్స్ మీద కూడా శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. అక్కడక్కడా కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. అలాగే ఈ సినిమా స్టొరీ లైన్ అమితాబ్ బచ్చన్ నటించిన ‘సర్కార్’ సినిమా స్టొరీలైన్ కి చాలా దగ్గర పోలికలు ఉంటాయి.
సాంకేతిక విభాగం :
సినిమాటోగ్రాఫర్ పనితనం బాగుంది. ముఖ్యంగా కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ని బాగా చూపించాడు. సాయి కార్తీక్ అందించిన రీ రికార్డింగ్ సినిమాకి చాలా పెద్ద హెల్ప్ అయ్యింది. ప్రతి యాక్షన్ ఎపిసోడ్ కి అతని మ్యూజిక్ ప్రాణం పోసింది. డైలాగ్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా మోహన్ బాబుకి రాసిన పంచ్ డైలాగ్స్, తనికెళ్ళ భరణికి రాసిన వేదాంతం డైలాగ్స్ చాలా బాగున్నాయి. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ ఓకే అనేలా ఉంది. కొన్ని చోట్ల తన పైత్యాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. అదే కనుక కంట్రోల్ చేసుకొని ఉంటే ఇంకా బాగుండేది.
తీర్పు :
ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘రౌడీ’ మోహన్ బాబు రేంజ్ కి తగ్గట్టుగానే ఉంది. డా. మోహన్ బాబు పవర్ ప్యాక్ పెర్ఫార్మన్స్, మంచు విష్ణు పెర్ఫార్మన్స్, మంచి డైలాగ్స్, రన్ టైం రెండు గంటలే కావడంతో ఆడియన్స్ ఈ సినిమాకి రెస్పెక్ట్ ఇచ్చి హ్యాపీగా చూడొచ్చు. రెగ్యులర్ కమర్షియల్ పాయింట్స్ అయిన కామెడీ, పాటలు లేకపోవడం మరియు గాడ్ ఫాదర్, సర్కార్ లాంటి సినిమాలు చూసిన వారికి ఈ సినిమా పెద్దగా నచ్చకపోవచ్చు. ఏ సెంటర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే ఈ సినిమా బి,సి సెంటర్స్ లో పెద్దగా ఆడే అవకాశం ఉండకపోవచ్చు.